రాజకీయాల్లో గుజరాతీ నాయకుల రాజకీయాలు వేరేగా ఉంటాయని అంటారు పరిశీలకులు.ఇప్పుడు ఇలాంటి రాజకీయమే ఏపీని ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తుండడం గమనార్హం.
తమ వేలితో తమ కన్నునే పొడుచుకునేలా చేసే రాజకీయాలు చేయడంలో గుజరాతీ నేతలుఆరితేరారు.దేశ రాజకీయ చరిత్రను చూసుకుంటే.
ఇలాంటి అనేక పరిణామాలు మనకు కనిపిస్తాయి.ఈ క్రమంలో ఇప్పుడు ఏపీపై కూడా ఇలాంటి గుజరాతీ రాజకీయాలే పనిచేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే రోజుల్లో ఏపీలో పాగా వేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారు.మరీ ముఖ్యంగా ఎట్టిపరిస్థితిలోనూ ఏపీలో పాగావేయాల్సిందేనని నిర్ణయించుకున్నట్టుగా కొన్ని రోజులుగా కనిపిస్తోంది.
దీనికి హేతువులు కూడా కనిపిస్తున్నాయి.స్థానికంగా ఉన్న కీలక పార్టీలైన.టీడీపీ, వైసీపీ, జనసేన(పొత్తులో ఉన్నప్పటికీ).లు.బీజేపీని ఎదగనివ్వకుండా చేస్తున్నాయనే భావన కేంద్రంలోని బీజేపీ పెద్దలకు బాగా నాటుకుపోయింది.ఈ నేపథ్యంలో ఈమూడు పార్టీలను తొక్కేయాల్సిందేనని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
అయితే.దీనికి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలూ చేపట్టకుండా.
ఆయా పార్టీల అధినేతలను డమ్మీలు చేసేస్తే సరిపోతుందని అనుకుంటున్నారని.ఈ క్రమంలోనే ఏపీపై కేంద్రం చేస్తున్న ఆపరేషన్లు కూడా అలానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన పార్టీని ప్రజల్లో డమ్మీ చేశారు.ప్రత్యేక హోదా విషయంలో ఆయనను ముప్పుతిప్పలు పెట్టి.ప్రజల్లో పలుచన చేసేసి.డమ్మీ అయ్యేలా చేశారని.
జాతీయ మీడియానే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇక, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పనిపడుతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
మూడు రాజధానుల విషయం నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం, కర్నూలుకు హైకోర్టు వంటి అనేక అంశాల్లో జగన్ కు సహకరించడం మానేసి.తద్వారా.
జగన్ ను ఓ విఫలమైన నాయకుడిగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయనేది ఢిల్లీ వర్గాల మాట.

ఇప్పటికే విశాఖ ఉక్కు విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం దాదాపు గా చెప్పేసింది.ఈ నేపథ్యంలో దీనిని కనుక జగన్ కాపాడుకోలేక పోతే.ప్రజల్లో ఈయన కూడా గతంలో చంద్రబాబు హోదా విషయంలో ఎలా మారిపోయారో.
అలానే మారిపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.ఇక, జనసేన నాయకుడు పవన్‌కు ఎలాంటి వాయిస్ లేకుండా చేసేయడం బీజేపీ ఎత్తుగడలో మరోకోణంగా కనిపిస్తోంది.
మొత్తంగా ఈ ముగ్గురిని ప్రజల్లో డమ్మీలుగా మార్చేస్తే.బీజేపీ ఎదగొచ్చనేది గుజరాతీ నేతల తెలివి తేటలుగా కనిపిస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు.