ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు ! పంతం వీడేది ఎవరు ? 

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.ఒకవైపు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని చుట్టుముట్టగా,  మరోవైపు పథకాలకు ప్రతినెల వేల కోట్లు వెచ్చించాల్సి రావడం,  ఇలా అనేక ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కొంటోంది.

 In The Case Of Prc The Dispute Between The Ap Government Employees Continues, Pr-TeluguStop.com

ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సి పై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు .పిఆర్సి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తామేమీ చేయలేమని , కొత్త పిఆర్సి ప్రకారమే చెల్లింపులు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది.ఈ మేరకు ప్రభుత్వం ప్రజలు , అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

సవరించిన పీఆర్సీ ప్రకారమే ఈ నెల జీతాలు చెల్లింపులు చేయాలని సూచించింది.జీతాలు చెల్లించేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సిఎఫ్ఎంఎస్ ను సిద్ధం చేస్తోంది.

దీని ప్రకారం వచ్చే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నారు.దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ వ్యవహారం చూస్తుంటే పిఆర్సి విషయంలో ఉద్యోగులు ఎంతగా ఆందోళన చేపట్టినా,  తాము వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది.ఇక ఉద్యోగులు సైతం ఇంతే స్థాయిలో పంతం పట్టారు.

ఫిట్మెంట్ , పీఆర్సీ ,  హెచ్ ఆర్ ఏ విషయంలో తాము తగ్గేదే లేదు అని,  ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు .అంతేకాదు సమ్మె  చేపట్టేందుకు సిద్దమని వారు హెచ్చరికలు చేస్తున్నారు .తాజాగా ఈ వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.
 

ఒకవైపు ఉద్యోగులు మరోవైపు ఏపీ ప్రభుత్వం ఎవరికివారు పంతం వీడే లేదు అన్నట్లుగా వ్యవహారాలు చేస్తూ ఉండడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే వైసీపీ వ్యతిరేక పార్టీలన్నీ ఉద్యోగ సంఘాల కు మద్దతుగా స్టేట్మెంట్ లు ఇస్తూ, ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube