కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అందమైన యువకుడు చూడటానికి చక్కగా ఉన్నాడని కూతురికి మంచి సంబంధమని మురిసిపోయారు తల్లిదండ్రులు.కట్నం కింద 6 లక్షలు పెళ్లి కి ఇచ్చి,2 లక్షలు అదనంగా ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేశారు కూతురికి.
మంచి సంబంధం మా కూతురు కి తిరిగి లేదంటూ సంతోషపడ్డారు ఆ తల్లిదండ్రులు.సంసారానికి పనికి రాడని తెలిసీ ఆ తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే చూడటానికి చక్కగా ఉన్నాడు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటూ మాయమాటలు చెప్పి సంసారానిక పనికిరాని వ్యక్తితో వివాహం చేసి తన జీవితాన్ని నాశనం చేశారని బాధిత యువతి సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేటకు చెందిన ఓ మహిళ తన కొడుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి గుంటూరు చెందిన యువతితో మే 26 వివాహం జరిపించారు.
పెళ్లి కొడుకు తల్లి మొదటి రాత్రి మా ఊరు భువనేశ్వర్ లో మా ఇంట్లో జరగాలని ఒత్తిడి చేసింది.అంత దూరం వద్దు అని అందుకు ఆ యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నరసరావుపేటలో ఏర్పాటు చేశారు.
అక్కడ అసలు విషయం బయటపడింది.br>
తొలి రాత్రి యువకుడు వింత ప్రవర్తన, విచిత్ర ధోరణి వ్యవహరించడం వధువు ఆశ్చర్యపోయింది.
మొదటి రాత్రి రోజు దగ్గరకు వచ్చి ఈ వయసులో కోరికల ఎక్కువ ఉండకూడదంటూ నిద్ర మాత్రలు వేసుకుని నిద్ర పోయాడట.అదే తరహాలో ఆ మూడు రాత్రులు వ్యవహరించడంతో అనుమానం వచ్చి నిలదీసింది ఆ పెళ్లి కూతురు.
అప్పుడు అతను ఇలా సమర్ధించుకున్నాడట భార్య భర్తలు అంటే శారీరక సంబంధం పెట్టుకోవడం కాదు మంచి స్నేహితులుగా ఉందాం అనడంతో ఆమె ఆశ్చర్యపోయింది.నాకు మానసిక పరిస్థితి బాగోలేదు మాత్రలు వేసుకో పోతే అనారోగ్యం గురవుతాం అంటూ తెలపడంతో ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది.

తల్లిదండ్రులు వచ్చి నిలదీయగా.విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి.అయ్యో గుడికి మానసిక స్థితి సరిగ్గా లేదని మాత్రలు వాడకపోతే ప్రమాదమని వ్యాధి తీవ్రమవుతుందని పేర్కొన్నారు.ఆ నవవధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.ఇన్ని విషయాలు మా దగ్గర దాసి పెట్టారని తనను మా కుటుంబాన్ని మభ్యపెట్టి మానసిక రోగి సంసారానికి పనికి రాని వ్యక్తితో వివాహం చేసి మోసగించిన భర్త, అత్త పెళ్లిళ్లు మధ్యవర్తి పై క్రిమినల్ చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరింది.