అల్లుడికి పిల్లతో పాటు వాటిని కూడా కట్నంగా ఇచ్చిన గొప్ప అత్తమామలు..!

అప్పట్లో పెళ్లిళ్లకు ఇప్పుడు పెళ్లిళ్లలకు చాలా తేడా ఉంది.

అప్పుడు పెళ్లి అంటే ఒక పండగ వాతావరణం ఉట్టిపడేలా చేసేవారు ఇంటినుండా చుట్టాలు, పక్కాలతో కళకళలాడుతూ ఉండేది.

బంధువులు అందరు కూడా పెళ్ళికి ఒకరోజు ముందే వచ్చేసి సందడి సందడి చేస్తూ ఉండేవాళ్ళు.పెళ్లి అయ్యేదాక ఉండి నూతన వధువరులను ఆశీర్వధించి మరి వెళ్లేవారు.

కానీ ఇప్పుడు పెళ్లిళ్లకు అప్పటి పెళ్లిళ్లకు అసలు పొంతనే లేదు.ఏదో పెళ్ళికి వచ్చామా, వాళ్ళకి కనిపించామా, భోజనం చేశామా, వెళ్ళొపోయామా అన్నట్టు పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

ఇక పెళ్లి మాట కాసేపు పక్కన పెడితే కట్నకానుకల విషయానికి వస్తే.అవి కూడా మారిపోయాయి.

Advertisement

ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కట్నకానుకలు సమర్పించుకోవడం అనవాయితీగా వస్తుంది.ఈ కాలంలో ఆడపిల్లల తల్లి తండ్రులు లక్షల్లో కట్నాలు, బైక్, కార్, బంగారం, స్థలాలు రాసివ్వడం లాంటివి అల్లుడికి కట్న కానుకుల కింద ఇస్తున్నారు.

కానీ మరికొంతమంది మాత్రం మళ్లీ పాత కాలంలో మాదిరిగా అల్లుడికి కట్నంతో పాటు ఎద్దులతో కూడిన ఎడ్ల బండిని కట్నం కింద ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు.ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.

ఉట్నూర్ మండలం దొంగ చింత గ్రామానికి చెందిన దంపతులకు లింగబాయ్ అనే కుమార్తె ఉంది.కూతురు పెళ్లిని కొద్దిరోజుల క్రితం గ్రామానికి చెందిన జూగాదిరావుకు ఇచ్చి పెళ్లి జరిపించారు.

ఇక ఆదివాసి వివాహం అవ్వడంతో వారి సాంప్రదాయాలు, కట్టుబాట్లు కూడా కాస్త వేరుగానే ఉంటాయి.ఆళ్లుడికిచ్చే కట్నం కూడా కాస్త వెరైటీ గానే ఇచ్చాడు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

కారు, బైక్ కాకుండా రెండు ఎద్దులు, ఒక ఎడ్లబండిని కట్నకానుకలు కింద అల్లుడికిచ్చారు వధువు తల్లిదండ్రులు.అల్లుడికిచ్చిన కట్నకానుకలు చూసి పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులు అందరూ ముందు షాక్ అయినా.

Advertisement

ఆ తర్వాత ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఘనంగా పెళ్లి తంతు, అప్పగింతలు ముగిసాక మావయ్య ఇచ్చిన ఇచ్చిన జోడెద్దులు ఎద్దులబండికి కొత్త దంపతులు పూజ చేసి అదే బండి పైన నూతన దంపతులు, బంధువులతో కలిసి మెట్టినింటి ఊరుకు వెళ్లారు.

తాజా వార్తలు