చిన్నారిని కర్రతో కొట్టి చంపిన పెద్దమ్మ.. టిఫిన్ తినలేదనే !

మొదట్లో ఇంట్లో పిల్లలు అన్నం తినకపోతే బుజ్జగించో.లాలించో అన్నం తినిపించేవారు.

తినేంత వరకు తిను బేటా అంటూ తల్లులు ప్లేట్ చేత పట్టి పిల్లల వెంట పడుతుంటారు.

కానీ ప్రస్తుతం మనుషుల జీవన విధానం మారింది.

ఈ ఇంటర్నెట్ యుగంలో తల్లులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లలో కథలు, రైమ్స్ పెట్టి తినిపిస్తున్నారు.ఎలా అయితేనేం పిల్లలు కడుపు నిండాలి అని ఆలోచించే వాళ్లు చాలా మంది ఉంటారు.

కానీ ఓ మహిళ టిఫిన్ చేయలేదని కోపంతో కర్రతో తన చెల్లెలి కూతురిని కొట్టింది.దీంతో ఆ చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.

Advertisement

ఇడ్లి తినలేదని చిన్నారిని కర్రతో కొట్టి చంపిన ఘటన కళ్లకురిచ్చి జిల్లాలో చోటు చేసుకుంది.త్యాగుదుర్గానికి చెందిన రోశి అనే వ్యక్తికి జయరాణి మహిళతో వివాహమైంది.

వీరిద్దరి సంతానం ప్రిన్సీమేరి (5).అయితే ఇటీవల జయరాణి మరణించడంతో రోశి రెండో వివాహం చేసుకున్నాడు.దీంతో అప్పటినుంచి ప్రిన్సీమేరి జయరాణి వాళ్ల తల్లి పచ్చయమ్మాల్ ఇంట్లో ఉంటోంది.

ఆ ఇంట్లో ప్రిన్సీమేరితో పాటు జయరాణి అక్క ఆరోగ్య మేరీ కూడా ఉంటోంది.ఇంట్లో పచ్చయమ్మాల్ లేకపోవడంతో ప్రిన్సీకి ఆమె పెద్దమ్మ ఇడ్లి తినమని పెట్టి ఇచ్చింది.

ప్రిన్సీ తాను ఇడ్లి తిననని వేరేది చేసి పెట్టమని చెప్పడంతో కోపోధ్రిక్తురాలైన పెద్దమ్మ దుడ్డు కర్రతో ప్రిన్సీ తలపై బాదింది.దీంతో పాప తీవ్రకు రక్త స్రావమై కిందకు పడిపోయింది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

భయంతో పెద్దమ్మ చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరోగ్య మేరీని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు