ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల డే కేర్ సెంటర్ లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి ( Gandhi Jayanti )సందర్భంగా జయంతి వేడుకలను చేయూత మిత్ర ఫౌండేషన్( Cheyuta Mitra Foundation ) అద్యక్షుడు కుంబాల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గాంధీ చిత్రపటానికి ఫౌండేషన్ అద్యక్షుడు కుంబాల సుధాకర్ రెడ్డి పూలమాల వేశారు.

అనంతరం డే కేర్ సెంటర్ లో ఉన్న వృద్దులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఫౌండేషన్ అద్యక్షుడు కుంబాల సుధాకర్ రెడ్డి, మాట్లాడుతూ అవసరం ఏదైనా డే కేర్ సెంటర్ కు ఉంటే మా ఫౌండేషన్ పక్షాన అండగా ఉంటామని అన్నారు.

ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ సభ్యులు బందారపు లక్ష్మారెడ్డి,ఒగ్గు బాలరాజు యాదవ్, దుస శ్రీనివాస్, మాదాసు నాగరాజు,బాద గోపి, రాజిరెడ్డి,బుచ్చీలింగు సంతోష్ గౌడ్,స్టాఫ్ నర్స్ సుజాత లు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం గ్రూప్ -2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
Advertisement

Latest Rajanna Sircilla News