ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది:ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్

నల్లగొండ జిల్లా(Nalgonda District):ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతుల ఎవరూ అధైర్య పడవద్దని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ (MLA Nenawat Balunaik)అన్నారు.నల్గొండ జిల్లా(Nalgonda District) చింతపల్లి మండలంలోని కుర్మేడులో సోమవారం ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని,గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా వదిలేసి చాలా పథకాలకు నిధులు విడుదల చేయడం రైతుల సంక్షేమంపై మా చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా మంత్రివర్గ ఉప సంఘం పని చేస్తుందని, నివేదిక ఇచ్చిన తర్వాతే తెలంగాణలో వచ్చే యాసంగి సీజన్ నుంచి ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు.రెండు లక్షల రుణమాఫీ నిర్ధారణ కాని రైతు కుటుంబాలను గుర్తించి ఖాతాలో నిధులు జమ చేస్తామన్నారు.

గత ప్రభుత్వం కొండలు, గుట్టలు,రియల్ ఎస్టేట్ వెంచర్లు,సాగులో లేని భూములకు సైతం దాదాపు 25 వేల కోట్లు ఇచ్చారని,మాప్రభుత్వంలో కేవలం సాగులో ఉన్న భూమికే రైతు భరోసా ఉంటుందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకపోయినా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు,నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్(Nagabhushan), కమిటీ చైర్మన్ దొంత అలివేలు,మాజీ ఎంపీపీ భవాని,మస భాస్కర్, కిన్నెర తదితరులు పాల్గొన్నారు.

దీపావళి కి రావాల్సిన కంగువా సినిమాను పోస్ట్ పోన్ చేయడానికి గల కారణాలు ఏంటి..?
Advertisement

Latest Nalgonda News