యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా: గుండాల మండలం తుర్కలశాపురం గ్రామంలో గత 15 ఏళ్లుగా ఇన్చార్జ్ రేషన్ డీలర్లే బియ్యం సరఫరా చేస్తున్నారని, వారు సరైన సమయపాలన పాటించకపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా స్థానిక వ్యక్తికి డీలర్షిప్ వచ్చేలా చూడాలని సోమవారం గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతు కె.
జెండగే(Collector Hanumantu K.Jendage) ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లయ్య, మహేందర్,లింగస్వామి(Mallaiah, Mahender, Lingaswamy) తదితరులు పాల్గొన్నారు.