రూ.40 చోరీ చేశాడు.. ఏడేళ్ల జైలు శిక్ష!

ఏంటి 40 రూపాయిలు దొంగతనం చేసినందుకు 7 ఏళ్ళు జైలు శిక్ష? ఇది నేను ఎక్కడ చూడలేదు అని అనుకుంటున్నారు కదా! అవును మరి అతను దొంగిలించింది నోట్లు కాదు.20 రూపాయిల కాయిన్స్ రెండు దొంగిలించాడు.

20 రూపాయిల కాయిన్స్ ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటున్నారా? అవి ఇంకా ముంబైలోని ఎంఆర్‌ఏ మార్గ్‌‌లోని ప్రభుత్వ మింట్‌లో ముద్రిస్తున్నారు.ముద్రిస్తున్న కాయిన్స్ నే అందులో పనిచేస్తున్న చబుక్షర్ అనే వ్యక్తి దొంగిలించాడు.

అనంతరం ఆ కాయిన్స్ ని రోజువారీ తనిఖీలతో బయటకు తీసుకెళ్లకుండా అక్కడే తన లాకర్‌లో ఉంచాడు.అయితే అతడి లాకర్‌‌లో నాణేలు ఉన్నట్లు భద్రత పర్యవేక్షిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ అధికారి గుర్తించారు.

దీంతో అధికారుల సమక్షంలో అతడి లాకర్ తెరిచి చూడగా కాయిన్స్ బయటపడ్డాయి.కాయిన్స్ కు రక్షణగా ఉండాల్సిన వ్యక్తే వాటిని దొంగిలించాడని ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు.

నేరం రుజువైతే ఆ సెక్షన్ కింద అతనికి ఏడేళ్లు జైలు శిక్ష పడనుంది.కాగా అతను ఇలా కాయిన్స్ మొదటిసారి తీశాడా ? లేక గతంలోను ఇలాంటి పనికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కరోనా వైరస్ కారణంగా అతన్ని అదుపులోకి తీసుకోలేదని, ఇప్పుడు దర్యాప్తుకు సహకరించాలని అతడికి నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

కాగా 2019 మార్చి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కొత్త నాణేలను విడుదల చేశారు.అందులో రూపాయల నాణెం కూడా ఉంది.

అవి ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు