ఒక్కరోజులో రెండు ఘటనలు.ఇద్దరు కీలక నేతలకు తగిలిన ఎదురు దెబ్బలు.
టీడీపీలో ఒకవిధమైన గందరగోళాన్ని సృష్టించిందని అంటున్నారు పార్టీ సీనియర్లు.నాయకులు తలకో రకంగా మాట్లాడి.
పార్టీలైన్ కు భిన్నమైన వాదన వినిపించారని గుసగుసలాడుతున్నారు.తాజాగా ఇదే విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు సైతం అంతర్మథనం నిర్వహించినట్టు విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ ఒకరు తనకు అత్యంత నమ్మకస్తులైన పాత్రికేయులతో ఆఫ్ దిరికార్డుగా పేర్కొనడం గమనార్హం.
“పోలీసులను ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు దూకుడుగా వ్యవహరించారు.ఇక, పోలీసులను వుద్దేశించి పార్టీ అధినేత చంద్రబాబు సైతం సంయమనం కోల్పోయారు.
దీనిపై పార్టీలోనే కొంత గందరగోళం ఉంది. ఈ విషయంపై పొలిట్ బ్యూరోసైతం చర్చ చేస్తోంది“- అని సదరు నాయకుడు పాత్రికేయులకు వెల్లడించారు.
అలా అని ఉండాల్సింది కాదని ఆయన వెల్లడించారు.నేను హోంమంత్రి అయ్యాక.
మీ అంతు తేలుస్తా! అని అచ్చెన్న అనడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

అదే సమయంలో నన్ను కూడా చంపుతారా? చంపండి! అంటూ.చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది.గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్.
ఎప్పుడూ ఇలా వ్యాఖ్యానించలేదు.విశాఖలో ఎయిర్ పోర్టులోకి అడుగు పెట్టనివ్వనప్పుడు నేను కాబోయే సీఎంను అన్నారు.
దానికీ.ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదని .అంటున్నారు సీనియర్లు.ఈ విషయాన్ని సీనియర్లు వేరే కోణంలో చూస్తున్నారు.
ఇప్పటి వరకు పార్టీపై ఉన్న సింపతీ పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు కామెంట్లు, ఇటు అచ్చెన్న కామెంట్లు కూడా వివాదానికి దారితీశాయని అంతర్మథనం చెందుతున్నారట.
దీనికి విరుగుడుగా.పోలీసులకు సానుభూతి వ్యక్త పరిచేలా రేపు ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.
మరి ఏం జరుగుతుంద చూడాలి.