వైసీపీ ఎంపీ, ఎమ్మెల్సీని కాపాడ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మాః రామ‌కృష్ణ‌

మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఎంపీ గోరంట్లని ర‌క్షించ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మా అని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ప్ర‌శ్నించారు.

ఎంపీ వ్య‌వ‌హారంలో వీడియో ఫేక్ అని ఎస్పీ ఫ‌కీర‌ప్ప ఎలా చెప్ప‌గ‌ల‌ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్ర‌భుత్వం స్పందించి ఎంపీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.అదేవిధంగా మాజీ డ్రైవ‌ర్ హ‌త్య కేసులో జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంత‌బాబుని కాపాడ‌టం ఏంట‌ని నిల‌దీశారు.90 రోజుల్లో ఛార్జిషీటు వేయ‌కుండా స‌హ‌క‌రిస్తున్నార‌న్న రామ‌కృష్ణ‌.ఎమ్మెల్సీకి బెయిల్ ఇప్పించేందుకు కుట్ర చేస్తున్నార‌న్నారు.

ఈ కేసులో ప్ర‌భుత్వ వైఫ‌ల్యంపై ఉద్య‌మిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు