ఎయిర్ స్ట్రైక్స్ నేపధ్యంలో అఖిలపక్షం కీలక భేటీ!

పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దాడులు నేపధ్యంలో భారత ప్రభుత్వం వాటిపై వివరణ ఇవ్వడానికి విపక్ష పార్టీలతో నేరు అఖిలపక్ష బేటీ ఏర్పాటు చేస్తుంది.

ఈ అఖిలపక్ష బేటీలో ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలపై ఎందుకు యాక్షన్ తీసుకుంది.

దాని వెనుక కారణాలని వివరించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ అఖిల పక్ష బేటీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో జరగనున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా వుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకి ఇప్పటికే దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి, రాజకీయ పార్టీల వరకు, అలాగే పౌర హక్కుల సంఘాల నుంచి, సెలబ్రిటీల వరకు అందరూ మద్దతు ఇచ్చారు.ఈ నేపధ్యంలో తాజాగా జరగబోయే అఖిలపక్ష బేటీలో కేంద్ర ప్రభుత్వం చెప్పబోయే వివరణకి విపక్షాలు పూర్తిగా మద్దతు ఇచ్చే అవకాశం వుందని తెలుస్తుంది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు