బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న 'పక్కా కమర్షియల్'.. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

మ్యాచో స్టార్ గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో గోపీచంద్ కూడా ఉన్నారు.

ఈయన హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.తన లాస్ట్ సినిమాను గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో చేసాడు.

సీటిమార్ సినిమాతో ప్రేక్షకుల చేత సీటిమార్ వేయించాడు.గోపీచంద్ సీటిమార్ సినిమా హిట్ తర్వాత మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేసాడు.

పక్కా కమర్షియల్ పేరుతొ ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement
Gopichand Pakka Commercial 3 Days Box Office Collections Details, Pakka Commerci

ఈ సినిమా జులై 1న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఫస్ట్ డే మిశ్రమ స్పందన వచ్చిన కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుంది.ఈ సినిమా మొత్తంగా 15.20 కోట్ల బిజినెస్ జరుపుకుందట.దీనికి అనుగుణంగానే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లగా నమోదు అవ్వగా.3 రోజుల్లోనే ఈ సినిమాకు 6.47 కోట్ల షేర్ తో 11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.ఇక ఓవరాల్ గా ఈ సినిమా వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నట్టు టాక్.

Gopichand Pakka Commercial 3 Days Box Office Collections Details, Pakka Commerci

ఈ సినిమాకు మేకర్స్ ప్రొమోషన్స్ తో కలిపి దాదాపు 35 కోట్లు ఖర్చు చేశారట.అయితే డిజిటల్, సాటిలైట్, హిందీ రీమేక్ రైట్స్ అన్నిటికి కలిపి 32 కోట్లు ముందే రాబట్టినట్టు తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమాను నిర్మాతలే చాలా చోట్ల ఓన్ గా రిలీజ్ చేసుకోవడం వల్ల కూడా ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేయగలిగింది.

మరి గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేసి నిర్మాతల జేబులు నింపుతుందో చూడాలి.ఈ సినిమాను యువీ క్రియేషన్స్, జీఏ 2 బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించగా.

జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు