సరికొత్త ఫీచర్లను పరిచయం చేసిన గూగుల్

మారుతున్న టెక్నాలజీని యూజర్లకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ల ద్వారా గూగుల్ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంది.తాజాగా సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తోంది.

 Google Has Introduced The Latest Features New Features, New Technology, Update,-TeluguStop.com

ప్రస్తుతం వివిధ సోషల్ మీడియా యాప్‌లలో కొన్ని ఫొటోలను డౌన్ లోడ్ చేసుకున్నప్పుడు, వాటిపై ఏదైనా రాసి ఉండడం మనం గమనిస్తుంటాం.ఆయా ఫొటోలపై పెద్ద పెద్దగా టెక్స్ట్ ఉంటుంది.

ఆ సమాచారం మనకు కొన్ని సందర్భాల్లో అవసరం పడొచ్చు.ఆ సమాచారాన్ని ఇతర యాప్‌లలో వాడుకోవాలనుకుంటే దానిని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది.

దీనికి గూగుల్ లెన్స్ వంటి వాటి సాయంతో ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు.ఆ సమాచారాన్ని కాపీ చేసుకుని, మనకు అవసరమైన చోట వాడుకోవచ్చు.

ఇందు కోసం తొలుత గూగుల్ లెన్స యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.ఆ తర్వాత యాప్ ఓపెన్ చేయగానే మీరు ఏ ఫొటోపై టెక్స్ట్ కాపీ చేయాలనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేసుకోవాలి.

దానిపై ఉన్న టెక్స్ట్ మీకు ఎంత వరకు కావాలో, దానిపై అలాగే కాసేపు నొక్కి ఉంచాలి.ఆ తర్వాత మీకు కావాల్సిన మేర టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.

ఈ ప్రక్రియ అయిన తర్వాత మీ స్క్రీన్‌పై కాపీ టెక్స్ట్ (Copy Text) ఆప్షన్‌ కనిపిస్తుంది.దానిని క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం మీకు కావాల్సిన చోట పేస్ట్ చేసుకుని, వినియోగించుకోవచ్చు.కంప్యూటర్ అయినా, ఫోన్‌లో అయినా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో కూడా ఆ టెక్స్ట్‌ను వాడుకోవచ్చు.

ఇంత మొత్తం ప్రాసెస్ లేకుండా సులువుగా స్మార్ట్‌ఫోన్లలో మరో టెక్నిక్స్ కూడా ఉన్నాయి.గూగుల్ ఫొటోస్‌ను వెబ్ సర్వీస్ నుంచి కూడా ఇమేజెస్‌పై ఉన్న టెక్స్ట్‌ను కాపీ చేసుకోవచ్చు.

ఏదైనా ఇమేజ్‌పై మీకు నచ్చిన టెక్స్ట్స్ ఉంటే దానిని సెలెక్ట్ చేసుకోవాలి.దానిని ఓపెన్ చేయగానే, పై భాగంలో కుడి వైపున “Copy Text from Image” అని కనిపిస్తుంది.

ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత దానిని కాపీ చేసుకోవాలి.ఈ కాపీ చేసుకున్న కంటెంట్‌ను మీకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube