కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.
ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఇక ఇప్పుడు ఈయన తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
తాజాగా విజయ్ నటించిన సినిమా బీస్ట్.ఈ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.ఇక ఆ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమా తర్వాత విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తన 67వ సినిమాను చేయనున్నాడు.ఇప్పటికే ఈయనతో మాస్టర్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఇక లోకేష్ కనకరాజ్ ఇటీవలే చేసిన విక్రమ్ సినిమా ఊహించని కలెక్షన్స్ సాధిస్తూ దూసుకు పోతుంది.ఈ సినిమా సక్సెస్ ను లోకేష్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక త్వరలోనే విజయ్ తో సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను లలిత్ కుమార్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించ బోతుంది.తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను లోకేష్ ప్రేక్షకులకు తెలిపాడు.ఫ్యాన్స్ తో జరిపిన ఇంటరాక్షన్ లో ఈ సినిమా గురించి చెబుతూ.
ఈ సినిమాలో విజయ్ ఒక గ్యాంగ్ స్టర్ గా రఫ్ క్యారెక్టర్ లో చూపిస్తాడని చెప్పడంతో ఈ సినిమా కోసం అందరు ఈగర్ గా వైట్ చేస్తున్నారు.విజయ్ 66వ సినిమా పూర్తి అయితే కానీ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయిస్తారు.







