దివికేగిన రతన్ టాటా .. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్

భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86)( Ratan Tata ) కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఆయన మరణంతో భారతీయులు శోకసంద్రంలో మునిగిపోయారు.

టాటా మరణంతో పలువురు ప్రముఖులు, కార్పోరేట్ దిగ్గజాలు సంతాపం ప్రకటిస్తున్నారు.ఈ జాబితాలో గూగుల్- ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్( Sundar Pichai ) కూడా ఉన్నారు.

గూగుల్‌లో( Google ) రతన్ టాటాతో నా చివరి సమావేశం జరిగిందని ఆయన గుర్తుచేసుకున్నారు.భారత్‌లో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంతో పాటు దేశాభివృద్దిలో రతన్ టాటా కీలకపాత్ర పోషించారని పిచాయ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) ప్రెసిడెంట్ అతుల్ కేశప్ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.పద్మవిభూషణ్( Padma Vibhusan ) గ్రహీత అయన రతన్ టాటా దాతృత్వానికి రోల్ మోడల్ అన్నారు.2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆయన దేశభక్తి, మానవత్వం, మూగ జంతువుల పట్ల టాటా ప్రేమ వంటివి వెలుగుచూశాయని అతుల్ అన్నారు.ఇండియాస్పోరా వ్యవస్ధాపకుడు ఎంఆర్ రంగస్వామి( MR Rangaswamy ) మాట్లాడుతూ.

Advertisement

భారత్‌లోని దిగ్గజ వ్యాపారవేత్తలలో రతన్ టాటా ఒకరని ప్రశంసించారు.ఆయన మరణం పట్ల ఇండియాస్పోరా తీవ్ర విచారంలో ఉందన్నారు.

పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలు భారత్‌పైనే కాకుండా ప్రపంచం మొత్తం మీద చెరగని ముద్ర వేశాయన్నారు.రతన్ టాటా వారసత్వం తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉంటుందని రంగస్వామి ప్రశంసించారు.

రతన్ టాటా గ్రాడ్యుయేషన్ చేసిన కార్నెల్ యూనివర్సిటీ( Cornell University ) సైతం ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.కార్నెల్ ట్రస్టీగా వర్సిటీకి రతన్ అతిపెద్ద దాతగా మారారని వర్సిటీ తాత్కాలిక అధ్యక్షుడు మైఖేల్ ఐ కోట్లికాఫ్ అన్నారు.కార్నెల్‌లో ఆర్కిటెక్చర్‌లో పట్టభద్రుడయ్యాక.

నాయకత్వం, దాతృత్వం, మానవాళి పట్ల నిబద్ధత, విద్య, పరిశోధనలు వంటి అంశాలతో ప్రపంచంపై ప్రభావం చూపారని కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ , ఆర్ట్ అండ్ ప్లానింగ్ డీన్ జే మీజిన్ అన్నారు.

అత్తతో గొడవ.. భర్తతో గొడవ.. వైరల్ అవుతున్న పూరీ జగన్నాథ్ సంచలన పోస్ట్!
Advertisement

తాజా వార్తలు