శుభవార్త: ఇపుడు టూరిస్టు, బిజినెస్ వీసాలను కలిగి వున్నవారు కూడా అమెరికాలో జాబ్​ వెతుక్కోవచ్చు?

అమెరికా( America )లో ఉద్యోగం చేయాలనుకొనేది ప్రతి ఒక్కడి కల.ఇపుడు అలాంటివారికి అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది.

విషయం ఏమంటే టూరిస్ట్, బిజినెస్ వీసా( Tourist, Business Visa )పై తమ దేశానికి వచ్చిన వారు సైతం అక్కడ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.ఈ క్రమంలో ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధంగా వెసులుబాటును కల్పించింది అమెరికా ప్రభుత్వం.

అయితే ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

సాధారణంగా బీ1 వీసా( B1 visa )ను వ్యాపార పనుల మీద వచ్చిన వారికి, బీ2 వీసాను ( B2 visa )పర్యాటకులకు అమెరికా జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే.కాగా ఆ దేశ తాజా నిర్ణయంతో ఈ 2 వీసాల కేటగిరీలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని యూఎస్​ సిటిజెన్​షిప్​ అండ్​ ఇమ్మిగ్రేషన్​ సర్వీసెస్​ మార్చి 23న ట్వీట్​ చేయడం జరిగింది.ఇకపోతే టెక్ అగ్ర సంస్థల్లో ఇటీవల భారీగా ఉద్యోగాల కోతతో వేలాది మంది విదేశీయులు తమ ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసినదే.

Advertisement

అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.ఈ లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నవారు 60 రోజులలో మరో ఉద్యోగాన్ని చూసుకోవాల్సి ఉంటుంది.వీరు అప్పటికే ఉద్యోగం సంపాదిస్తే అమెరికాలో ఉండవచ్చు.

లేదంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది.అయితే ఉద్యోగం వెతుక్కునేందుకు వేర్వేరు మార్గాలు ఉన్నాయంటూ బుధవారం అనగా మార్చి 23న టూరిస్టు, బిజినెస్ వీసాలకు సంబంధించి యూఎస్ సీఐఎస్ వరుస ట్వీట్లు చేసింది.60 రోజుల్లో ఉద్యోగం రానివారు దేశం విడిచి వెళ్లాలన్న అంశాన్ని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వారికి అనేక మార్గాలున్నాయని అంటూ పేర్కోవడం విశేషం.అవును, హెచ్-1బీ వీసా ఉన్నవారు ఉద్యోగం కోల్పోయినా వారికి పలు అవకాశాలున్నాయి.

కాబట్టి నిశ్చంతగా అక్కడ ఉద్యోగాలు వెతుక్కోవచ్చు.

వైరల్ వీడియో : వ్యూస్ కోసం యూట్యూబర్ రైల్వే ట్రాక్ పై ఏకంగా..?
Advertisement

తాజా వార్తలు