ముంబై ఇండియన్స్ అభిమానులకు శుభవార్త..!

కరోనా  వైరస్ సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ పై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఇప్పటికే ముగ్గురు ఐపీఎల్ క్రికెట్ ఆటగాళ్ళు కరోనా వైరస్ బారిన పడ్డారు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అక్షర్ పటేల్ తో సహా బెంగళూర్ జట్టు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్, కోల్‌కతా ప్లేయర్ నితిష్ రాణా లకు కరోనా వైరస్ సోకింది.ప్రస్తుతం వీళ్ళు ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.

అయితే కరోనా బారిన పడితే పలు ఐపీఎల్ మ్యాచులకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదిలా ఉండగా తాజాగా ముంబై ఇండియన్స్ టీమ్ కి వికెట్‌ కీపింగ్‌ కన్సల్టెంట్‌ గా ఉన్న కిరణ్‌ మోరేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ఐతే కిరణ్ మోరే ముంబై ఇండియన్ ప్లేయర్స్ బస చేస్తున్న హోటల్ లోనే బస చేస్తున్నారు.దీంతో ఆయన నుంచి ఇంకా ఎంతమందికి కరోనా వైరస్ సోకి ఉంటుందేమోనని టీమ్ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురయ్యింది.

Advertisement

అనంతరం మంగళవారం రోజు హుటాహుటిన టీమ్ సభ్యులందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించింది.అయితే కొవిడ్ 19 పరీక్షలలో అందరికీ నెగిటివ్ గా నిర్ధారణ కావడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది.

ఈ శుభవార్త విన్న ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ముంబై ఇండియన్స్ టీం తో పాటు ఇతర టీం యాజమాన్యాలు కూడా కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నాయి.

ఇకపోతే చెన్నై వేదికగా ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్ లో మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్.రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తలపడనుంది.

అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం లో అత్యంత కీలక ఆటగాడైన దేవ్‌దత్ పడిక్కల్ కి కరోనా సోకడంతో ఆయన తొలి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నారు.దీంతో ఆ టీం కి అతని లేని లోటు ఎంతో కొంత నష్టం చేకూర్చుతుందని తెలుస్తోంది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు