ఫుడ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. పిజ్జా తిన్నా సన్నబడొచ్చు

ప్రస్తుత ఆధునిక యుగంలో అంతా చిరుతిళ్లకు, ఫాస్ట్ ఫుడ్‌ కోసం బాగా అలవాటు పడ్డారు.

అందరూ ఎక్కువగా బరువు పెరగడానికి కారణం పిజ్జాలు, బర్గర్‌లు అని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఎంత కంట్రోల్ చేసుకున్నా, వీటిని తినకుండా ఉండలేరు.వైద్యుల సూచనతో ఆరోగ్యం కోసం ఈ పిజ్జాలను, బర్గర్ లను తినడం చాలా మంది ఆపేస్తారు.

అయితే ఆహార నిపుణులు ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్ అందించారు.పిజ్జాలు తిన్నా, ఆహార ప్రియులు బరువు తగ్గొచ్చని పేర్కొంటున్నారు.

అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని, కొన్ని పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Good News For Food Lovers.. You Can Lose Weight By Eating Pizza Food Lovers, Go
Advertisement
Good News For Food Lovers.. You Can Lose Weight By Eating Pizza Food Lovers, Go

బరువు తగ్గేందుకు కొందరు పిజ్జాలు తినడం మానేస్తారు.అయితే పిజ్జాలు తింటూ కూడా బరువు తగ్గొచ్చని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.ఇటాలియన్ వంటకం అయిన పిజ్జాను మైదా పిండితో చేస్తారు.

దీని వల్ల బరువు పెరగొచ్చు.అయితే మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండితో పిజ్జాను చేయాలి.

ఇందులోని ఫైబర్, ఇతర పోషకాలు బరువు తగ్గేందుకు దోహదపడతాయి.అంతేకాకుండా ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, బెల్ పెప్పర్స్, బచ్చలికూర, కూరగాయలు, టమోటాలు వంటివి పిజ్జాలో చేర్చాలి.

ఫలితంగా కేలరీలు తక్కువగా ఉంటాయి.

Good News For Food Lovers.. You Can Lose Weight By Eating Pizza Food Lovers, Go
విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
బీఎల్ఏ దాడి.. 'జాఫర్ ఎక్స్‌ప్రెస్' రైలు హైజాక్

పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.శరీరంలో అదనంగా కొవ్వు చేరదు.బరువు తగ్గాలనుకునే వారు ఇలా ప్రయత్నిస్తే ఉపయోగం ఉంటుంది.

Advertisement

ఏదేమైనా పిజ్జాను "మితంగా తీసుకోవాలి".ఇదే ప్రధానమైన ఆహారం కాదు.

బరువు తగ్గడానికి వివిధ రకాల పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.అదనంగా, మీ దినచర్యలో క్రమం తప్పని వ్యాయామాన్ని చేర్చడం వల్ల సులభంగా బరువు తగ్గే వీలుంది.

తాజా వార్తలు