మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంగా రీమేక్ చేస్తున్నారు.ఈ రీమేక్ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వం వహించగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా వర్క్ చేసి ఎడిటర్ అనే పేరుని ఇంటిపేరుగా మార్చుకున్న ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజా.ఈయన చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాకి కూడా పనిచేశారు.
ఇలా సుమారు 20 సంవత్సరాల తర్వాత మోహన్ రాజా గాడ్ ఫాదర్ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ సందర్భంగా మోహన్ రాజా మాట్లాడుతూ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నేను చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి నేను చిరంజీవికి పెద్ద అభిమానిని అని ఆయన తెలియజేశారు.ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాకి పని చేశాను.
తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు.

ఇక లూసిఫర్ రీమేక్ చిత్రంగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాను అచ్చం అలాగే చేయకుండా చిరంజీవి గారికి అనుగుణంగా కొన్ని మార్పులను చేసినట్లు వెల్లడించారు.ఇక ఈ సినిమాలో ఆయన షూటింగ్లో పాల్గొంటూ.షూటింగ్ చేస్తున్నంతసేపు ఆయన నటనను చూస్తూ అలాగే ఉండిపోయి ఆ సన్నివేశానికి కట్ చెప్పడం కూడా మర్చిపోయానని ఈ సందర్భంగా మోహన్ రాజా చిరంజీవి పై ఉన్న అభిమానం, ఆయన నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.