గోదావరి పుష్కరాల ఉదంతం తప్పు భక్తులదే ?

గోదావరి పుష్కరాల సందర్భంగా గతేడాది జూలై 14న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఘోర దుర్ఘటనపై విచారణ పర్వం కొనసాగుతూనే ఉంది.

ఘటనకు కారకులెవరన్న విషయాన్ని నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ గడువు ముగిసినా, ఇంకా విచారణను కొనసాగిస్తూనే ఉంది.

ఇక ఈ కమిటీకి జిల్లా అధికార యంత్రాంగం తరఫున ఆ జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ తాజాగా 15 పేజీలతో కూడిన నివేదికను సమర్పించారు.ఈ నివేదికలో అధికార యంత్రాంగం తప్పేమీ లేదన్న కలెక్టర్.

భక్తుల తొందరపాటే దుర్ఘటనకు కారణమని తేల్చేశారు.ఘాట్ కు చేరుకున్న భక్తులు గంటల తరబడి నిద్రాహారాలు లేకుండా నిరీక్షించి ఎండవేడిమికి డీహైడ్రేషన్ కు గురయ్యారని కలెక్టర్ ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఆక్సిజన్ అందలేదని, ఈ కారణంగానే తొక్కిసలాట జరగిందని నివేదించారు.భక్తుల ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు కూడా వెడల్పుగానే ఉన్నాయని పేర్కొన్న కలెక్టర్.

Advertisement

భక్తుల తొందరపాటు కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.తొలి రోజు మాత్రమే ప్రమాదం జరిగిందని, మిగిలిన 11 రోజుల్లో చిన్నపాటి దుర్ఘటన కూడా చోటుచేసుకోలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

అయితే ఘటన జరిగిన సందర్భంగా అప్పట్లో ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసిన కలెక్టర్.పుష్కర ఘాట్ లో సీఎం నారా చంద్రబాబునాయుడు ఎక్కువ సేపు గడపడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని పేర్కొన్నారు.

తాజాగా భక్తుల తొందరపాటే ఘటనకు కారణమంటూ అదే కలెక్టర్ నివేదిక ఇవ్వడం గమనార్హం.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు