తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ మెడికల్ బిల్లుల గోల్ మాల్

తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ మెడికల్ బిల్లుల గోల్ మాల్ వ్యవహారం సంచనలం సృష్టిస్తోంది.ఈ నేపథ్యంలో రెండు ఆస్పత్రులతో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు అధికారులు.

వైద్యం చేయకపోయినా చేయించినట్లు నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వానికి టోపి పెట్టడంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.ఈ మేరకు ఆస్పత్రికి ఎల్ఓసీ ఇప్పించి కేటుగాళ్లు డబ్బులు కాజేశారని గుర్తించారు.

నెల క్రితం సచివాలయ రెవెన్యూ శాఖ విభాగాధికారి మూర్తి ఫిర్యాదుతో ఖమ్మంలోని శ్రీ వినాయక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, మిర్యాలగూడలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులపై కేసు నమోదు అయింది.అదేవిధంగా జ్యోతి, లక్ష్మీ, దిరావత్, శివపై కేసు నమోదు చేశారు.

అనంతరం కేసు సైఫాబాద్ పీఎస్ నుంచి సీసీఎస్ కు బదిలీ అయింది.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు