పాపం అని అతను కారు లో లిఫ్ట్ ఇచ్చినందుకు 1500 ఫైన్..! అసలేమైందో తెలుస్తే ఇంకెప్పుడు లిఫ్ట్ ఇవ్వరు!

పాపం పోనీ అని లిఫ్ట్‌ ఇవ్వటం ఆ వ్యక్తి పాలిటే శాపంగా మారింది.హఠాత్తుగా ఊడిపడ్డ ట్రాఫిక్‌ అధికారి చలాన్‌ రాసి చేతిలో పెట్టాడు.

ముంబైకి చెందిన నితిన్‌ నాయర్‌ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు రూపంలో తెలియజేశాడు.

ఘటన జూన్ 18న ముంబై ఐరోలి సర్కిల్‌లో జరిగింది.నితిన్ నాయర్ ముగ్గురు అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చారు.వర్షానికి తోడు రవాణా సౌకర్యాలు లేక జనం ఇబ్బంది పడుతుండటం చూసి అక్కడే ఉన్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, మరో వృద్ధుడిని తన కారులో ఎక్కించుకున్నాడు.

ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ వెంటనే నితిన్ వద్దకు వచ్చి చలాన్ రాసిచ్చాడు.ఫైన్ కట్టాలన్నాడు.నితిన్ డ్రైవింగ్ లైసన్స్ తీసుకుని మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకోవాలని సూచించాడు.

Advertisement

తీరా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కోర్టుకు వెళ్లమన్నారు.కోర్టుకు వెళ్లిన నితిన్ న్యాయమూర్తి ముందు తప్పు చేసిన వాడిలా నిలబడాల్సి వచ్చింది.

ఫైన్ కట్టి బయటపడ్డాడు.తన అనుభవాన్ని నితిన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తే ఫైన్ కట్టాల్సిందేనని మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.సెక్షన్ 66/192 ప్రకారం అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని కూడా చెబుతున్నారు.నితిన్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు