Soft skin : పైసా ఖర్చు లేకుండా ఈ సింపుల్ చిట్కాతో మృదువైన మెరిసే చర్మాన్ని పొందవచ్చు.. తెలుసా?

ముఖ చర్మం మృదువుగా, మెరిసిపోతూ కనిపించాలని దాదాపు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ అటువంటి చర్మం పొందడం అంత సుల‌భం కాదని భావిస్తుంటారు.

ఈ క్రమంలోనే మేకప్ తో మెరుగులు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే పైసా ఖర్చు లేకుండా మృదువైన మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చసొన( Egg yolk ) వేసుకోవాలి.

అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి.చివరిగా రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

గుడ్డులోని పచ్చ సోన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.గుడ్డు పచ్చ సన్న లో ఉండే పోషకాలు సెబమ్ స్రావాన్ని తగ్గించి, మొటిమలను నివారించడంలో సహాయపడుతాయి.ముడతలను మాయం చేసి చర్మాన్ని తేమ గా మారుస్తాయి.

అలాగే ఆరెంజ్ జ్యూస్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆయిల్ ( Citric acid ) ను కంట్రోల్ చేసి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.స్కిన్ గా బ్రైట్‌గా మారుస్తుంది.

ఏజింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తుంది.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

అలాగే విటమిన్ ఈ ఆయిల్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

Advertisement

మంచి తేమను ఇస్తుంది.విటమిన్ ఇ ఆయిల్‌ను ఫేస్ మాస్క్‌లో జోడించడం వల్ల మీ చర్మానికి అదనపు హైడ్రేషన్ అందుతుంది.

స్కిన్ టైట్ అవుతుంది.కాబ‌ట్టి మృదువైన అందమైన మెరిసే చ‌ర్మాన్ని కోరుకునేవారు త‌ప్పుకుండా ఇప్పుడు చెప్పుకున్న హెమ్ రెమెడీని ప్ర‌య‌త్నించండి.

మంచి రిజ‌ల్ట్ మీసొంతం అవుతుంది.

తాజా వార్తలు