ట్విట్టర్ అధికారిక ఖాతా పొందండిలా..!

సోషల్ మీడియా అంటే ఎక్కువగా వినిపించే పేరు.ట్విట్టర్.

సెలబ్రిటీలందరికీ ట్విట్టరే ప్రధాన వేదిక అని చెప్పొచ్చు.

ప్రభుత్వాలు కూడా తమ అధికారిక ప్రకటనను ట్విట్టర్ ద్వారా వెల్లడించడం పరిపాటి.

ట్విట్టర్ అనేది అంతర్జాలంలో లభించే సామాజిక మాధ్యమ సేవ.ఇందులో సభ్యులు ట్వీట్లు అనబడే చిన్న చిన్న సందేశాలను పంపడమే కాకుండా చదువుకోవచ్చు.నమోదైన సభ్యులు తమ సందేశాలను పోస్టు చేయవచ్చు.

సభ్యులు కానివారు సందేశాలను కేవలం చదువుకోవడానికే వీలుంటుంది.ఈ సేవను వాడుకరులు ట్విట్టర్ వెబ్ సైటు ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా, లేదా ఎస్సెమ్మెస్ ద్వారా కూడా వాడుకుంటూ ఉంటారు.

Advertisement

అయితే తాజాగా ట్విట్టర్ మూడేళ్ల తర్వాత పబ్లిక్ వెరిఫికేషన్‌‌ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది.గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో అధికారిక ఖాతా అనేది అందరికీ దొరకడం లేదు.

గతంలో 2017 నవంబర్‌లో పబ్లిక్ వెరిఫికేషన్‌ను ట్విట్టర్ ఆపేసింది.తాజాగా ఆ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది.

ట్విట్టర్ ఖాతా వెరిఫికేషన్‌కు ప్రభుత్వం, కంపెనీలు, బ్రాండ్లు, ఆర్గనైజేషన్లు, న్యూస్ ఆర్గనైజేషన్లు, జర్నలిస్టులు, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్స్ మరియు గేమింగ్, యాక్టివిస్ట్‌లు, ఆర్గనైజర్లు, పబ్లిక్‌లో పేరున్న ఇతర వ్యక్తులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.ట్విట్టర్ యాప్ ద్వారా కానీ, లేదంటే గూగుల్ బ్రజర్ నుంచి కానీ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి ట్విట్టర్ అడిగిన వివరాలు ఇవ్వాలి.

ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.అనంతరం వెరిఫైడ్ అనే ఆప్షన్ కింద ‘రెక్వెస్ట్ వెరిఫికేషన్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ట్విట్టర్ అడిగిన వివరాలు జతచేసి రెక్వెస్ట్ పంపితే, ట్విట్టర్‌ ఖాతాకు జత చేసిన ఈమెయిల్ ఖాతాకు ధ్రువీకరణ ఈమెయిల్ వస్తుంది.దీంతో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

Advertisement

మీరు పంపిన వివరాల్ని తనిఖీ చేసి వెరిఫైడ్ ఖాతాను ట్విట్టర్ విడుదల చేస్తుంది.

తాజా వార్తలు