ఆడవాళ్లకు సెలవు అంటూ కెప్టెన్ గౌతమ్ నిర్ణయం.. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఇలా అంటూ?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) ట్విస్ట్ లు, కోట్లాటలు, గొడవలతో రసవత్తరంగా సాగుతోంది.

ఇప్పటికీ ఎనిమిది వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం 9 వ వారం కొనసాగుతోంది.

తాజాగా ఎనిమిదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లోకి యాక్టర్, డాక్టర్ గౌతమ్ కృష్ణ( Gautham Krishna ) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తన మాటలు ఆటలు గేమ్ లతో ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి హైలైట్ అయ్యాడు.

ఫిజికల్, మెంటల్ టాస్కులను దిగ్విజయంగా పూర్తి చేస్తూ సత్తా చాటుతున్నాడు.మధ్యలో సీక్రెట్ రూమ్‌( Bigg Boss Secret Room )కు కూడా వెళ్లొచ్చాడు.ఆ తర్వాత నుంచి అశ్వద్దామాగా తనలోని 2.O వెర్షన్‌ను చూపిస్తున్నాడు.ఇలా గతంలో కంటే మరింత స్ట్రాంగ్‌గా, మెచ్యూరిటీతో కనిపిస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉంటే సాధారణంగా ప్రతి వారం కెప్టెన్సీ టాస్కును ఏదో రకమైన టాస్కులతో ఇస్తుంటారు.అందుకు తగ్గట్లుగానే ఎనిమిదో వారం కూడా అలా కొన్ని టాస్కులు ఇచ్చి కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేశారు.

ఇందులో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు కెప్టెన్సీ( Captaincy Task ) కోసం పోటీ పడ్డారు.కానీ, గౌతమ్ కృష్ణ మాత్రమే ఇంటి సభ్యులు అందరి మద్దతును కూడగట్టుకుని కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.

కెప్టెన్ గా అవతరించిన గౌతమ్ కృష్ణ ఒక నిర్ణయం తీసుకొని అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.కెప్టెన్‌గా గౌతమ్ ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరు తీసుకొని, ఎవరూ ఊహించని మరో నిర్ణయం తీసుకున్నాడు.ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు.

ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో వాళ్లదే అప్పర్ హ్యాండ్.ప్రతి ఇంట్లో ఉన్న, ఇక్కడ ఉన్న, టీవీల్లో చూస్తున్న ఆడవాళ్లకు గౌరవంగా మన బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫీమేల్ వీక్ జరుపుకుందాము.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఇందుకోసం ఈ వారం అంతా లేడీస్‌‌కు హాలీడేస్( Holidays ) ఇస్తున్నాను అని తెలిపాడు.దీంతో అతడి నిర్ణయాన్ని అందరూ మెచ్చుకుని ఓకే చెప్పారు.

Advertisement

హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్లు( Lady COntestants ) అందరూ చాలా సంతోషపడ్డారు.బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం ఏ కంటెస్టెంట్ తీసుకోలేదు.

ఫలితంగా గౌతమ్ నేషనల్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో గౌతమ్ కృష్ణ పేరు మారుమోగడంతో పాటు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు బిగ్బాస్ ప్రేమికులు, గౌతమ్ కృష్ణ అభిమానులు.

తాజా వార్తలు