బిర్యానీ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు పట్టణంలోని పరివార్ బిర్యానీ సెంటర్ లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో సుమారు 4 లక్షల రూపాయల మేరకు నష్టం జరిగింది.

హోటల్లో వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ ఇప్పుతుండగా లీక్ కావడంతో ప్రమాదం సభవించినట్లు తెలుస్తోంది.

ప్రమాదాన్ని పసిగట్టి అందరూ బయటకు రావడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

నష్టం విలువ సుమారు 4 లక్షలు వుంటుందని అంచనా వేశారు.ప్రజలు వేసవిలో సేఫ్టీ సూచనలు పాటించాలని అగ్ని మాపక సిబ్బంది మధుకర్ రెడ్డి సూచించారు.

Advertisement

Latest Video Uploads News