ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పేర్లలో RRR సినిమా పేరు ఒకటి.ఈ సినిమా మరొక వారం రోజులలో విడుదల అయ్యి ఏడాది పూర్తి చేసుకుంటుంది.
ఇలా ఈ సినిమా విడుదల ఏడాది అవుతున్నప్పటికీ ఈ సినిమా హావా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తగ్గలేదని చెప్పాలి.అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో కూడా నిలిచింది.
ఈనెల 12వ తేదీ ప్రకటించబోయే ఆస్కార్ అవార్డులలో భాగంగా ఈ సినిమాకు తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు రావాలని ప్రతి ఒక్క భారతీయుడు ఆకాంక్షిస్తున్నారు.
ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు నామినేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ప్రపంచం మొత్తం నాటు నాటు ఫీవర్ పట్టుకుంది అయితే తాజాగా ఈ సినిమాలోని ఈ పాటపై ప్రముఖ ప్రవచనకర్త గరకపాటి నరసింహారావు స్పందించారు.ప్రపంచం మొత్తం ఇలా నాటు నాటు పాట గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఆ పాటలో ఏముందో తెలుసుకోవడం కోసం తాను కూడా ఈ పాట చూశానని తెలిపారు.
ఈ పాట చూసిన తర్వాత ఎందుకు ఈ పాటకు ఇంత క్రేజ్ వచ్చిందో నాకు అర్థమైందని ఈయన వెల్లడించారు.

అచ్చమైన తెలుగులో రాసినటువంటి ఈ పాటలో ఎక్కడా కూడా ఒక ఇంగ్లీష్ మొక్క కూడా లేదు ఇలాంటి అచ్చ తెలుగు పాటను అందించిన రచయిత చంద్రబోస్ గారికికృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇంత అద్భుతమైన పాట పాడిన గాయకులకు సంగీతమందించిన కీరవాణి గురించి కూడా ఈయన ప్రశంసలు కురిపించారు.ఇక ఇందులో కలిసి డాన్స్ చేసినటువంటి ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి కూడా ఈయన మాట్లాడుతూ

ఈ పాటలో ఈ ఇద్దరు కూడా ఒకే విధంగా డాన్స్ చేయడం తనని ఎంతగానో ఆశ్చర్యపరిచిందని బహుశా కవలలు కూడా ఇలా చేయలేరేమో అంటూ గరికపాటి రామ్ చరణ్ ఎన్టీఆర్ పర్ఫామెన్స్ పై ప్రశంసల కురిపించారు.ఇక ఇంత అద్భుతమైన పాటకు తప్పనిసరిగా ఆస్కార్ రావాలని ప్రతి ఒక్కరు భగవంతుడిని ప్రార్థించండి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.