Ejaz maharastra : దోమలను పట్టుకొని కోర్టుకు హాజరైన గ్యాంగ్‌స్టర్‌.. ఎందుకో తెలుసా?

అవును, మీరు విన్నది నిజమే.ఓ గ్యాంగ్‌స్టర్ చచ్చిపోయిన దోమలను ఏకంగా కోర్టుకు తీసుకెళ్లాడు.

దాంతో కోర్టు అధికారులు విస్తుపోయారు.ఇకపోతే ఇలా తీసుకెళ్లడం వెనక పెద్ద కారణమే వుంది సుమా.

వాటిని కోర్టులో జడ్జ్ కి చూపించి.జైల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని వాపోయాడు.

అందువలన జైలులో దోమ తెర ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలని కోరాడు.అయితే న్యాయస్థానం ఆయన అభ్యర్థనను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది.

Advertisement

ఈ పర్మిషన్ అడిగిన డాన్ మరెవరో కాదు, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మాజీ సహచరుడు ఎజాజ్ లక్డావాలా.అవును, ఎజాజ్‌పై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.2020 జనవరిలో అరెస్టైన అతడు అప్పటి నుంచి నవీ ముంబై సమీపంలోని తలోజా జైల్లో ఉంటున్నాడు.కాగా ఇటీవల జైల్లోని దోమల సమస్యపై దరఖాస్తు పెట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే జైలు గదిలో దోమల తెర వినియోగానికి అనుమతిని కోరాడు.అందులో భాగంగానే గురువారం కోర్టు విచారణ సందర్భంగా చచ్చిన దోమలతో నిండిన ప్లాస్టిక్ సీసాను కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది.

జడ్జ్‌కు దానిని చూపించి.దోమల బెడద గురించి వివరించాడు.

అతగాడు మాట్లాడుతూ. దోమల వలన తాను మాత్రమే కాకుండా, ఇతర ఖైదీలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని, దోమల తెర వినియోగించేందుకు అనుమతించాలని కావాలని బతిమిలాడాడు.ఈ సందర్భంగా 2020లో తాను అరెస్టైనప్పుడు దోమల తెర వినియోగానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, అయితే ఈ ఏడాది మే నెలలో భ్రదతా కారణాలతో ఆ దోమ తెరను జైలు అధికారులు తీసేసుకున్నారని వాపోయాడు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
రతన్ టాటా స్థాపించిన మొత్తం కంపెనీలు ఇవే..?

ఇకపోతే లక్డావాలా అభ్యర్థనను న్యాయస్థానం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది.భద్రతా కారణాల రీత్యా అది ఇకనుండి కుదరదు అని చెప్పింది.దానికి బదులు ఓడోమోస్ వంటి వాటిని ఉపయోగించవచ్చని సూచించింది.

Advertisement

తాజా వార్తలు