తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నేలకూలిన బాహ్య ఇంధన ట్యాంక్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తేలిక పాటి యుద్ధ విమానం తేజస్‌ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బాహ్య ఇంధన ట్యాంక్ నేలకూలినట్లు తెలుస్తుంది.

ఈరోజు ఉదయం తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న సులుర్ ఎయిర్ బేస్ సమీపంలో ప్రమాదవ శావత్తు విమానం నుండి జారి పడి పోయినట్లు తెలుస్తుంది.

అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ మంగళవారం ఉదయం ఆ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ ట్యాంకు కనపడింది.తేజస్‌ విమానాలు 2001 నుంచి గగనతలంలో ఎగురుతున్నాయి.

అయితే, ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి.మంగళవారం తేజస్‌ నుంచి కిందపడిన ట్యాంకు భారతీయ వైమానిక దళానికి చెందినది.

ఈ విమానం సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి గాల్లోకి ఎగిరగా మంగళవారం 8:40 గంటల నిమిషాల్లో ఈ ఇంధన ట్యాంక్ ఊడిపడిపోయినట్లు తెలుస్తుంది.అయితే ఇంధన ట్యాంక్ కింద పడిపోయినప్పటికీ తేజస్ విమానం మాత్రం సురక్షితంగానే కిందకు దిగింది.

Advertisement

అయితే ఇంధన ట్యాంక్ వేగంగా వచ్చి.ఒక్క సారిగా భూమిని డీకొట్టడంతో దగ్గరలో పనిచేస్తున్న రైతులు ఆ శబ్దానికి అవాక్కైయారు.

ఈ ఘటన జరగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ట్యాంకు కిందపడడంతో సూలూరులోని చిన్నియంపాలయం ప్రజలు దానిని గుర్తించి కోయంబత్తూరు పోలీసులకు తెలిపారు.

దీంతో ఐఏఎఫ్‌ నుంచి సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ ట్యాంకును స్వాధీనం చేసుకొన్నారు.ఈ ట్యాంకును చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.ఈ ఇంధన ట్యాంకులో 1200 లీటర్ల మేరకు ఇంధనాన్ని ఫిల్ చేయొచ్చు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు