ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు.లుహాన్క్స్, డొంటెస్క్, జపరోజియా, ఖేర్సన్ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాయి.
ఎనిమిదేళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి క్రిమియాను పుతిన్ విడగొట్టిన విషయం తెలిసిందే.గత కొన్ని నెలలుగా రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.
రష్యా వైమానిక దాడుల్లో ఇప్పటికే పలువురు మృత్యువాతపడటంతో.ఆ ప్రాంతాలు సమాధి దిబ్బలుగా మిగిలాయి.







