భారత త్రివిధ దళాధిపతిగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు.త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ అనిల్ చౌహాన్ విధులు నిర్వహించనున్నారు.ముందుగా జాతీయ యుద్ధ స్మారకం వద్ద తన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు.
అనంతరం ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.







