స్టైలిష్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సెప్టెంబర్ 29వ తేదీ తన పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ తన భార్య చేత కేక్ కట్ చేయించి ఆ ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన భార్యకు హ్యాపీ బర్త్డే క్యూటీ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా తన భార్య చేతకే కట్ చేయించిన అనంతరం తన భార్య పిల్లలతో కలిసి అల్లు అర్జున్ అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.
ఇకపోతే అల్లు అర్జున్ తన భార్య పుట్టినరోజు సందర్భంగా స్నేహ రెడ్డికి సర్ప్రైజ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన భార్య పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ రెండు కోట్ల రూపాయలు ఖరీదైన డైమండ్ రింగ్ తనకు బహుమతిగా ఇచ్చారని తెలుస్తుంది.
ఇలా తన భార్యకు ఖరీదైన గిఫ్ట్ బహుమతిగా ఇవ్వడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో 2011వ సంవత్సరంలో ఎంతో ఘనంగా స్నేహ రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశారు.ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న అల్లు అర్జున్ వృత్తి పరమైన జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొనబోతున్నారు.
పుష్ప సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.







