నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ డిమాండ్...

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయించాలని బిజెపి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ డిమాండ్ చేశారు.హైదరాబాద్ మల్లాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను బిజెపి నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది అందులో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నత్తనడక నడుస్తున్నాయి.2017 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎలా ఉందో ఈ రోజు వరకు కూడా అలాగే ఉందని డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసి నిరుపేదలకు ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు