భ‌వ‌నం కూల్చివేత‌ వివాదంలో విజ‌య‌సాయిరెడ్డి పై ప‌ల్లా సంచలన ఆరోప‌ణ‌లు.. ?

తాను బాధపెడితే తప్పులేదు, కానీ తనను బాధ పెడితే మాత్రం అదొక నేరంగా పరిగణించే వారు రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తారు.

ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిన చెల్లుద్ది అనే నమ్మకం ప్రతి నేత మనసుల్లో బలంగా నాటుకు పోతుంది.

అందుకే కావచ్చూ అప్పటి దాక భవిష్యత్తుకు పునాదులు ఏర్పరచిన పార్టీ ఒక్కసారి అధికారాన్ని కోల్పోగానే ఆ పార్టీ నేతలు దాదాపుగా అధికారంలోకి వచ్చిన మరో పార్టీ చుట్టూ చీమల్లా ముసురుకుంటారు.ఇది రాజకీయంగా ఎదగడానికి చాలా దోహదపడుతుందనే నమ్మకంతో ఇలా నమ్మక ద్రోహానికి కూడా వెనకాడరు నేతలు.

ఇకపోతే తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైన భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్ష అనుభవించ వలసిందే.కానీ కొందరు పెద్దలు మాత్రం దీనికి ఒప్పుకోరు.

ఇదిలా ఉండగా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ జీవీఎంసీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎ కు చెందిన బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే.కాగా ఈ ఘటన పై స్పందించిన పల్లా త‌న భ‌వ‌నాన్ని కూల్చడానికి కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డేన‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తనను వైసీపీలో చేరాలని విజయసాయి రెడ్డి ఆహ్వానించగా, అందుకు ఒప్పుకోక పోవడంతో త‌న‌ భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు.ఈ భవన విషయంలో తాను ఎలాంటి అక్రమాలకు, ఉల్లంఘనలకు పాల్పడలేదని, అనుమతులు తీసుకునే భవన నిర్మాణం చేపట్టామ‌ని పేర్కొన్నారు.

ఇది రాజకీయ కక్షలో భాగంగా చేసిన పని అని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు