మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత..!!

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్( Prakash Singh Badal )(95) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాదల్.

హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడవటం జరిగింది.మొహాలీలో( Mohali ) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

శిరోమణి అకాలీదళ్( Shiromani Akali Dal ) అధినేతగా .బాదల్ పంజాబ్ రాజకీయాల్లో కీలకంగా రాణించారు.1970-71, 1977-80, 1997-2002, 2007-2017 లలో పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఈయన సిక్కుల కేంద్రీకృత పార్టీ శిరోమణి అకాలీదల్ పార్టీకి చెందినవాడు.

ఈయన ఆ పార్టీకి 1995 నుండి 2008 వరకు అధ్యక్షునిగా వ్యవహరించాడు.

Former Punjab Chief Minister Prakash Singh Badal Passed Away , Punjab, Prakash S
Advertisement
Former Punjab Chief Minister Prakash Singh Badal Passed Away , Punjab, Prakash S

2015 వ సంవత్సరంలో భారత దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకోవటం జరిగింది.1947లో పంజాబ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన బాదల్.గ్రామ సర్పంచ్ తర్వాత లాంబి బ్లాక్ సమితి చైర్మన్( Lambi Block Samiti ) గా.అనంతరం 1957లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి పంజాబ్ విధాన సభకు ఎన్నికయ్యారు.పంజాబ్ రాష్ట్ర రాజకీయాలలో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది.

భారత దేశంలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా బాదల్ చరిత్ర సృష్టించాడు.ప్రకాష్ సింగ్ బాదల్ మరణంతో శిరోమణి అకలి దళ్ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు