MLA Aruri Ramesh : బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్..!!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్( MLA Aruri Ramesh ) షాక్ ఇచ్చారు.

ఆయన బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో( Kishan Reddy ) కలిసి ఆరూరి రమేశ్ ఢిల్లీకి వెళ్లారని సమాచారం.కేంద్రంలోని పెద్దల సమక్షంలో ఆరూరి రమేశ్ కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు.

అనంతరం ఆరూరి రమేశ్ ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.అయితే నిన్న ఆరూరి రమేశ్ పార్టీ మార్పు వ్యవహారంలో హైడ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే.

ఆయన బీఆర్ఎస్ ( BRS )ను వీడి బీజేపీలో చేరతారన్న ప్రచారం కొనసాగగా.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Former Minister Errabelli Dayakar Rao ) ఆయనను హైదరాబాద్ కు తీసుకెళ్లారు.ఈ క్రమంలో ఆరూరిని కిడ్నాప్ చేశారనే వార్తలు సైతం వచ్చాయి.

Advertisement

కానీ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే పార్టీ నేతలతో కలిసి గులాబీ బాస్ కేసీఆర్ ను కలవడానికి వచ్చానని చెప్పారు.కానీ ఇవాళ అనూహ్యంగా ఆయన బీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ కాషాయకండువా కప్పుకోనేందుకు హస్తినకు వెళ్లారు.

అయితే వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేయడంపై ఆరూరి రమేశ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు