తాడేపల్లికి చేరిన మాజీమంత్రి బాలినేని పంచాయితీ

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ తాడేపల్లికి చేరింది.ఈ క్రమంలో ఇవాళ క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు.

అయితే గత నెల 29న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేసిన విషయం తెలిసిందే.నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు.

కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యం దక్కడం లేదని బాలినేని గత కొన్ని రోజులుగా బాలినేని అసంతృప్తిగా ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆయన రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయగా.

తాడేపల్లికి రావాలంటూ హైకమాండ్ పిలిచింది.అధిష్టానం పిలుపుకు స్పందించని బాలినేని మూడు రోజుల తర్వాత ఇవాళ సీఎం జగన్ ను కలిశారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు