తిరుమల శ్రీవారి సేవలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు

తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandrababu naidu ) దంపతులు దర్శించు కున్నారు.

భార్య భువనేశ్వరి( , Nara bhuvaneswari )తో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన ఇవాళ స్వామి వారికి జరిగే విఐపి విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి ముక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శ్రీవారి పాద పద్మాల చెంత పుట్టి.

అంచెలు.అంచెలుగా ఎదిగాను.

అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు కాపాడారు.కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని వేడుకుంటాను.

Advertisement

తిరుమల వచ్చి మ్రొక్కులు చెల్లించుకుంటాను.ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించాను.

ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలనేది నా ఆకాంక్ష.తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి.

ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నాను.త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తాను అంటూ మీడియా తో చంద్రబాబు మాట్లాడారు.

చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు