ఏపీని వదిలేసి తాను తెలంగాణ వస్తానని, అప్పట్లో రాయల తెలంగాణ కావాలని జైపాల్ రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదని దాని వల్ల చాలా నష్టపోయామని మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కలిశారు.సీఎం తో కాసేపు ముచ్చటించారు.
కేసీఆర్ సీఎం అయ్యాక ఎప్పుడు కలవాలేదని అందుకే ఇప్పుడు కలిసి మాట్లాడినట్లు స్పష్టం చేశారు.తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని రాయలసీమను కూడా తెలంగాణలో కలిపి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణతోపాటు ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు.శాసనసభ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ ను కలిసిన అనంతరం సిఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో సరదాగా మాట్లాడారు.
ఏపీ వదిలేసి తెలంగాణకు వస్తానని జేసీ.దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని తెలిపారు.రాయల తెలంగాణ కావాలని జైపాల్ రెడ్డి ని అడిగితే ఒప్పుకోలేదని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడొద్దని జేసికి భట్టి తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.

పార్టీకి నష్టం కలిగే మాటలు బయట మాట్లాడుకోవాలి గట్టిగా హెచ్చరించారు.ఆ మాటలకు స్పందించిన జేసీ… తాను పుట్టింది, పెరిగింది, అభివృద్ధి చెందిన కూడా కాంగ్రెస్ పార్టీలోనే అని వివరించారు.పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి షోకాజ్ నోటీసులు తీసుకోనని వెల్లడించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఫలితాలు నాకెలాంటి ఆశ్చర్యం కలిగించలేదు.జగన్ అనుకున్నాడు.
ఆ ఫలితాలు వచ్చాయి అంతే… అని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు
.