మైనర్ బాలికకు అశ్లీల వీడియోలు చూపించి, ఆపై పలు మార్లు రేప్ ...!

అభం శుభం తెలియని పసిపిల్లల మీద లైంగిక దాడులు ఆగడం లేదు.శిక్షలు ఎంత కఠినతరమైన మనుషుల్లో మార్పు రావడం లేదు.

మగ మృగాలు రెచ్చిపోతున్నారు.బడికి వెళ్ళే పిల్లలను సైతం ఈ క్రూర మృగాలు వదలడం లేదు.

ఏడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థినికి అశ్లీల వీడియోలు చూపించి.పలు మార్లు ముగ్గురు స్కూల్ విద్యార్థులు రేప్ చేశారు.

ఈ ఘటన తమిళనాడులోని కొయంబత్తూరులో చోటు చేసుకుంది.సెక్సువల్ దాడి కింద పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Advertisement

ఇద్దరిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.మూడో వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

బాధితురాలైన బాలిక సుందరాపురం ప్రాంతం కు చెందింది.కొన్నేళ్ల క్రితం ఆమె తల్లి చనిపోవడంతో తండ్రి, పిన్నితో కలిసి ఉంటుంది.

వారిద్దరూ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఇంటి ఓనర్ దగ్గరకు అప్పుడప్పుడు టీవీ చూడటానికి బాలిక వెళ్లేది అని తెలుస్తుంది.

హౌజ్ ఓనర్ కు 16 ఏళ్ల కొడుకు ఉన్నాడు.ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదవుతున్నాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనుకునేవాడు.ఇటీవల ఆన్ లైన్ ‌క్లాసుల కోసం ఓ మొబైల్ ఫోన్ కూడా అతనికి ఇచ్చారు.కునాల్(17) అనే మరో ఫ్రెండ్ పలు మార్లు అతని ఇంటికి వస్తుండేవాడు.మే 20న రోజూ లాగానే గుడియా టీవీ చూసేందుకు యజమాని ఇంటికి వచ్చింది.

Advertisement

ఇంట్లోకి రాగానే ఆ ఇద్దరు బాలురు మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు గమనించింది.అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించేసరికి ఆ ఇద్దరు బలవంతంగా బాలికను వీడియోలు చూసేలా చేశారు.

తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే తన ఇంటికి వెళ్లిపోయింది.తర్వాత ఏం జరిగిందని పోలీసులు విచారిస్తున్నారు.

తాజా వార్తలు