ఈ 5 అలవాట్లు ఉంటే మానుకోండి, లేదంటే చాలా తొందరగా ముసలితనం వచ్చేస్తుంది!

నేటి దైనందిత జీవితంలో రకరకాల ఆహార అలవాట్లు, శారీరక శ్రమ పూర్తిగా లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది నడి వయసులో కూడా ముసలివాళ్ళలాగా కనబడుతూ వుంటారు.

దానికి కారణం ప్రధానంగా వారికున్న ఈ 5 అలవాట్లు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందులో మొదటిది.కాఫీ,టీలు త్రాగటం.

అవును, మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ కానీ టీ కానీ లేకపోతే రోజు గడవని పరిస్థితి.ఇలా రోజు వీటిని తీసుకోవడం వల్ల, అందులోని కెఫెన్ వయసు మీరకనే వృద్ధాప్య ఛాయలు వచ్చేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు.

ఈ లిస్టులో రెండవది సీజనల్ ఫ్రూట్స్ తినకపోవడం.అవును, మానవుడు కాలనుగుణంగా పండే పండ్లను కాసిన్ని అయినా తీసుకోవాలి.లేదంటే వృద్యాప్య ఛాయలు తొందరగా వస్తాయని తాజా సర్వేలు చెబుతున్నాయి.

Advertisement

అవును, మీరు తరుచుగా పండ్లు తీసుకోవడం వల్ల, అందులోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యాంగా, అందంగా ఉంచడానికి దోహదపడతాయి.ఇక 3వ దురలవాటు పొగ త్రాగటం.ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఎంత మొత్తుకున్నా మనవాళ్ళు అస్సలు వినరు.

పైగా సినిమా థియేటర్లలో సదరు యాడ్స్ వస్తే జోక్స్ వేసుకుంటారు.

ఆ తరువాత భయంకరమైన అలవాటు ఆల్కహాల్ సేవించడం.ఆల్కహాల్ తీసుకొనేవారికి కూడా వృద్యాప్యచాయాలు తొందరగా వచ్చేస్తాయి.ఇందులోని చెడు గుణాలు శరీర జీవక్రియ రేటును తగ్గించి, ఆరోగ్యానికి హాని చేస్తాయి.

ఇక చివరగా వ్యాయామం.మనలో చాలామందికి వ్యాయామలు చేయడం అంటే బద్ధకం.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

పైగా ఈ ఊరుకులు పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి సమయం లేదని చాలా మంది షాకులు చెబుతూ వుంటారు.తరుచు వ్యాయామలు చేయడం వల్ల కూడా వృద్యాప్య ఛాయాలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్యానిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు