ఐదు మంది కలిసి ప్రేమోటింగ్.. ఆ స్టార్స్ ఎవరంటే?

కరోనా పుణ్యమా అంటూ చాలామంది రోడ్లపైకి వచ్చి షాపింగ్ చేయడం పూర్తిగా తగ్గించారని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఇంటినుంచి వారికి నచ్చిన ప్రొడక్టులను ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చాలా మంది ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తూ ఎంతో సురక్షితంగా ఉన్నారని చెప్పవచ్చు.ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ కు డిమాండ్ పెరగడంతో రోజుకొక ఈ కామర్స్ వెబ్సైట్ పుట్టుకొస్తున్నాయి.

ఇప్పటికే ఎన్నో ఈ కామర్స్ వెబ్సైటు ఉండగా వాటిని ప్రమోట్ చేస్తూ ప్రజలకు చేరువ చేసే పనిలో పడ్డాయి.ఈ విధంగా స్టార్ సెలబ్రిటీస్ చేత ప్రమోట్ చేయిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఈ కామర్స్ వెబ్సైట్లలో మింత్ర ఒకటి అని చెప్పవచ్చు.

ఆన్లైన్ ఫ్యాషన్ ఈ కామర్స్ వెబ్సైట్ మింత్ర ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు స్టార్ సెలబ్రిటీస్ తో ప్రమోట్ చేయిస్తూ యువతను ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలోనే హృతిక్ రోషన్, కియారా అద్వానీ, సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ను బరిలోకి దింపి వీరిచే ప్రమోట్ చేయిస్తోంది.

Five People Promoting Together Who Are Those Stars Five People, Promoting Toge
Advertisement
Five People Promoting Together Who Are Those Stars Five People, Promoting Toge

ఈ ప్రమోషన్ లో భాగంగా మొదట హృతిక్ రోషన్ తన ఫోటోను కియారాకి షేర్ చేస్తూ ఇది సరిపోతుందా అనగా ఇది బెటర్ అంటూ హృతిక్ తో తాను ఉన్నటువంటి ఫోటోను విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేస్తూ షేర్ చేసింది.

Five People Promoting Together Who Are Those Stars Five People, Promoting Toge

ఇక విజయ్ తనని కలుపుకొని మింత్రా ఫ్యాషన్ ఫ్యామిలీలో! హృతిక్, కియారా, దేవరకొండ కనిపిస్తున్న ఫోటోలి తనని తాను యాడ్ చేసుకుని సమంత కనిపిస్తుంది.చివరిగా ఈ ఫ్యామిలీలో దుల్కర్ తోడవడంతో ఈ ఐదుగురు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి ఈ క్రేజీ ఫోటోను మింత్ర అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు