అమెరికాలో చారిత్రాత్మక ఘటన.... తొలి “X జెండర్” పాస్ పోర్ట్ జారీ...

మనుషులలో ఆడ, మగ అనే బేధం ఉన్నట్లుగానే లెస్బియన్, బైసెక్సువల్, గే, ట్రాన్స్ జండర్ ఇలా X జెండర్ వర్గం కూడా ఉంటుంది.

అయితే వారిపై ఎంతో మంది చిన్న చూపు చూస్తూ ఉంటారు.

ఎన్నో అవమానాలు వారు ఎదుర్కుంటున్నా వారి వారి హక్కుల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు.అయితే గడిచిన 7 ఏళ్ళుగా తమ హక్కుల కోసం, తమకంటూ ప్రత్యేక మైన పాస్ పోర్ట్ జారీ చేయాలని అమెరికా ప్రభుత్వంతో డానా జిమ్ అనే వ్యక్తి పోరాడుతూనే ఉన్నారు.

తమకు న్యాయం చేయాలని, తాము కూడా మనుషులమే అంటూ ఆయన నినదించిన నినాదాలు ఎంతో మందిని కదిలించాయి.ఈ క్రమంలో తాజాగా అమెరికా ప్రభుత్వం తొలి “X జెండర్” పాస్పోర్ట్ జారీ చేసింది.

ఏళ్ళ తరబడి X జెండర్ పాస్ పోర్ట్ కోసం పోరాటం చేస్తున్న జిమ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మా శ్రమ ఫలించింది, ఇప్పటి వరకూ ఎన్ని అవమానాలు ఎదుర్కున్నామో మాకు తెలుసు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ప్రస్తుతానికి మాత్రం పాస్ పోర్ట్ అందుకోవడం ఎంతో షాక్ గా ఉందని తెలిపారు.ఇక తదుపరి లక్ష్యం ఒక్కటేనని పాస్ పోర్ట్ వచ్చిందని తిరగడానికి ఆసక్తి చూపను కానీ X జెండర్ వ్యక్తుల పూర్తి హక్కుల కోసం వారికి గుర్తింపు దక్కడం కోసం సాయం చేయడమే తన లక్ష్యమని తెలిపారు జిమ్.

ఇదిలాఉంటే X జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న మరో వ్యక్తి జెస్సికా ఇది అమెరికాలో చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు.ఇక ఈ పాస్ పోర్టు లు ఎవరికి జారీ చేస్తున్నారు అనే విషయాలని మాత్రం ప్రభుత్వం వెల్లడించడానికి ఇష్టపడటం లేదు.

ఎందుకంటే వారి పేర్లను వెల్లడించి వారి స్వేచ్చకు భంగం కానివ్వమని తెలిపారు.అయితే X జెండర్ పాస్ పోర్ట్ మొదటి సారిగా ఎవరికీ ఇచ్చారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు, ప్రభుత్వం ఈ విషయాలని గోప్యంగా ఉంచడంతో 2015 నుంచీ వారి హక్కుల కోసం పోరాడుతున్న మాజీ అమెరికా ఆర్మీ ఉద్యోగి, లింగ మార్పిడి చేయించుకున్న డానా జిమ్ కె మొదటి X జెండర్ పాస్ పోర్ట్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు