Fire-Boltt Oracle : ఫైర్ బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్ వాచ్ సూపర్ ఫీచర్లతో భారత మార్కెట్లో లాంచ్..!

ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ నుంచి ఫైర్ బోల్ట్ ఒరాకిల్( Fire-Boltt Oracle ) పేరుతో కొత్త స్మార్ట్ వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది.తక్కువ ధరలో, అధిక ఫీచర్లతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్లతో పాటు ధర వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Fire Bolt Oracle Smart Watch Launched In Indian Market With Super Features

ఫైర్ బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్ వాచ్:

ఈ వాచ్ 1.96 అంగుళాల HD స్క్రీన్ తో ఉంటుంది.ఈ వాచ్ స్టోరేజ్ విషయానికి వస్తే.2GB RAM+16GB స్టోరేజ్ తో ఉంటుంది.కాబట్టి ఈ వాచ్ లో అవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Fire Bolt Oracle Smart Watch Launched In Indian Market With Super Features

ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ విషయానికి వస్తే.700mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.కేవలం ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 36 గంటల పాటు నాన్ స్టాప్ గా పనిచేస్తుంది.

ఈ వాచ్ సిమ్ సపోర్ట్ గా పనిచేస్తుంది.ఈ వాచ్ లో 4G నెట్వర్క్( 4G network) తో పాటు వైఫై ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement
Fire Bolt Oracle Smart Watch Launched In Indian Market With Super Features-Fire

ఈ స్మార్ట్ వాచ్ లో గూగుల్ సూట్ యాక్సిస్ ఫీచర్ ను కూడా అదనంగా పొందుపరిచారు.అంతేకాకుండా మిగతా స్మార్ట్ వాచ్ లలో ఉండే అన్ని సాధారణ ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి.

హార్ట్ రేటింగ్ మానిటరింగ్( Heart rate monitoring ), SPO 2 లాంటి హెల్త్ ఫీచర్లు కూడా ఉన్నాయి.పలు రకాల స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఈ వాచ్ లో పొందుపరిచారు.

ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికి వస్తే.భారత మార్కెట్లో ఈ వాచ్ ధర రూ.4999 గా ఉంది.చూడడానికి ఆకర్షణీయమైన డిజైన్ తో కనిపించే ఈ వాచ్ మిగతా కంపెనీల వాచ్ లకు మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుంది.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు