'వీరమల్లు' సెట్స్ లో అగ్ని ప్రమాదం.. అయ్యయ్యో మళ్ళీ ఎదురు దెబ్బ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) లైనప్ లో చాలా సినిమాలు ఉన్నాయి.పవన్ ఇటీవల ప్రకటించిన సినిమాలను ముందుగా పూర్తి చేస్తూ ఎప్పుడో రెండేళ్ల క్రితం ప్రకటించిన సినిమాను మాత్రం వెనుక పెట్టాడు.

 Fire Accident On Pawan Kalyan Hari Hara Veera Mallu Sets, Hari Hara Veera Mallu,-TeluguStop.com

ఆ సినిమానే ”హరిహర వీరమల్లు”.ఈ సినిమా మాత్రం ఎందుకో తెలియదు కానీ ఆలస్యం అవుతూ వస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే 70 శాతం పూర్తి అయినట్టు టాక్.

క్రిష్(Krish Jagarlamudi ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ జరుపు కుంటూనే ఉంది.

పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.

మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Telugu Harihara, Nidhhi Agerwal, Pawan Kalyan, Tollywood-Movie

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ( Jacqueline Fernandez )కీ రోల్ లో నటిస్తుంది.చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఈ సినిమామీ ఎం ఎం రత్నం నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాకు మరో దెబ్బ పడినట్టు తెలుస్తుంది.గత రాత్రి ఈ సినిమా కోసం వేసిన సెట్స్ లో అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది.హైదరాబాద్ లోని దుండిగల్ ప్రాంతంలో ఈ సినిమా కోసం ఒక సెట్ వేసారట.

Telugu Harihara, Nidhhi Agerwal, Pawan Kalyan, Tollywood-Movie

ఈ సెట్స్ లో మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపు చేసినట్టు తెలుస్తుంది.అయితే వీరమల్లు టీమ్ నుండి మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.ఈ సినిమా కోసం వేసిన సెట్ ఆ మధ్య వర్షం కారణంగా తీవ్రంగా ధ్వంసం అయ్యింది.ఆ సెట్ కు మరమత్తులు చేస్తున్న సమయంలోనే మళ్ళీ అగ్ని ప్రమాదం జరిగింది.

ఇలా ఈ సినిమా నిర్మాతకు మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.పవన్ కాల్ షీట్స్ ఇవ్వకుండా చేస్తున్న జాప్యం వల్ల ఇప్పటికే నిర్మాతకు భారీ నష్టం వాటిల్లుతుంది.

ఇక ఇప్పుడు ఈ సెట్స్ పాడవ్వడం కూడా ఈయనకు మరో దెబ్బ పడుతుంది.ఇటీవలే పవన్ ఈ సినిమాకు కాల్ షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇంతలోనే ఈ అగ్నిప్రమాదం మళ్ళీ అడ్డంకులను సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube