టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు.లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే తాజాగా నర్సింగరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఆయన విప్రోలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కాగా నర్సింగరావుకు నిందితుడు ప్రవీణ్ కుమార్ ఏఈఈ పేపర్ ఇచ్చినట్లుగా నిర్ధారించారు.కాగా ఈ కేసులో ఇప్పటివరకు 46 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.







