పాటలు పాడుతున్న ఫైటర్..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీని క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించగా ప్రస్తుతం కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా వేశారు.

కాగా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ అదిరిపోయే హిట్ కొట్టాలని చూస్తున్నాడు.గతకొద్ది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలవడంతో, ఈసారి అదిరిపోయే సక్సెస్‌ను కొట్టి మళ్లీ ఫాంలోకి రావాలని విజయ్ దేవరకొండ చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం అవుతుండటంతో ఫైటర్ షూటింగ్‌ను కూడా పట్టాలెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ట్యూన్స్‌ను సమకూరుస్తున్నాడు మణిశర్మ.ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందిస్తున్నాడనే వార్తతో తొలుత అందరూ ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని సందేహ పడ్డారు.

Advertisement

కానీ పూరీతో మణిశర్మకు ఉన్న ట్రాక్ రికార్డులు చూసి వారు మరో మ్యూజికల్ బ్లా్క్‌బస్టర్ రానుందని ఆశిస్తున్నారు.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో బాలీవుడ్ కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టాలని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ భావించాడు.

కానీ దానికి పూరీ అంగీకరించకపోవడంతో మణిశర్మతోనే ఈ సినిమా సంగీతానికి ట్యూన్స్ కట్టిస్తున్నారు.ఇక నెక్ట్స్ షెడ్యూల్‌లో పాటలను షూట్ చేసేందుకు పూరీ అండ్ టీమ్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

సునామీలో టి సైలెంట్ నా ముందు నువ్వు సైలెంట్.. ఈ సినిమాతో శ్రీలీలకు హిట్టొస్తుందా?
Advertisement

తాజా వార్తలు