బిగ్ బాస్ షో అనేది ఒక ఫ్రాడ్ షో అంటున్న స్టార్ నటి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో వరుస సినిమాలు చూస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ ని సంపాదించుకోవాలని చూస్తారు.

ఇక ఇప్పుడు కొంతమంది నటులు పాపులారిటీ కోసం టెలివిజన్ లో అత్యంత పెద్ద షో గా పేరు పొందిన బిగ్ బాస్ లో( Bigg Boss ) పాల్గొనడం జరుగుతుంది.

బిగ్ బాస్ షో మీద మొదట్లో చాలా నెగిటివ్ కామెంట్లు కూడా వచ్చాయి.కానీ క్రమ క్రమం గా ఆ షో జనాల్లో ఎక్కువ పాపులారిటీ ని సంపాదించుకుంది.ఈ షో ద్వారా చాలామంది నటులు ఇండస్ట్రీలో మంచి అవకాశాలను కూడా అందుకుంటున్నారు.

ఇక ఈ సీజన్ లో కూడా చాలా మంది బిగ్ బాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చారు.అయితే ఒక నటి మాత్రం బిగ్ బాస్ షో వల్ల తన సర్వస్వం కోల్పోయానని చెబుతూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

Advertisement

ఇలాంటి క్రమంలో ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయడం బిగ్ బాస్ షో కి కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి.

ఆ వ్యాఖ్యలు చేసిన నటి ఎవరు అని అంటే గాయత్రి గుప్తా.( Gayatri Guptha ) శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా సినిమాలో( Fidaa Movie ) గాయత్రి గుప్తా సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించింది.అలాగే రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ( Amar Akbar Antony ) సినిమాలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

అయితే ఈమెకి గత రెండు సంవత్సరాల కోసం ముందుగా తెలుగు బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పి ఆమెను ఒక రెండు నెలల వరకు ఏ సినిమాలకి కమిట్ కాకుండా ఉండాలని అగ్రిమెంట్ కూడా రాయించుకున్న తర్వాత రెండు నెలలకి ఫోన్ చేసి మీరు బిగ్ బాస్ లోకి సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి తనని బిగ్ బాస్ షోలోకి తీసుకోలేదని అప్పట్లో ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.దానివల్ల తను తన సినిమా కెరియర్ ని చాలా వరకు నష్టపోయినని చెప్పారు.

దాంతో ఆమె బిగ్ బాస్ షో మీద ఘాట్ గా స్పందిస్తూ అదొక ఫ్రాడ్ షో దానివల్ల చాలామంది జీవితాలు అన్యాయమైపోతున్నయంటూ కామెంట్లు చేయడం జరిగింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు