Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం.. పార్టీలోకి కీలక నేతలు

లోక్‎సభ ఎన్నికల( Lok Sabha elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం జోరుగా సాగుతోంది.

వివిధ పార్టీల్లో టికెట్ రాని అసంతృప్త నేతలు హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు భారీగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.తాజాగా తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కలిశారు.

Festival Of Migration Into Telangana Congress Key Leaders Into The Party

దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జోరందుకుంది.అలాగే నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి( Marri Janardhan Reddy ) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి( BJP Leader Jithender Reddy )ని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన నేపథ్యంలో ఈయన కూడా హస్తం పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

వీరితో పాటు మరికొంతమంది కీలక నేతలను కూడా పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని సమాచారం.

Advertisement
Festival Of Migration Into Telangana Congress Key Leaders Into The Party-Telang
ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?

తాజా వార్తలు